Homeహైదరాబాద్latest News'కేసీఆర్​ ఏ సంకీర్ణంలో చేరతారు?' : Revanth

‘కేసీఆర్​ ఏ సంకీర్ణంలో చేరతారు?’ : Revanth

  • బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని మేం ముందునుంచే చెబుతున్నాం
  • కాంగ్రెస్‌ను అడ్డుకునేందుకు ఆ రెండు పార్టీలు కుట్రలు చేస్తున్నయ్
  • ఈ నెల 9లోగా ఒక్క రైతుకైనా బకాయి ఉంటే క్షమాపణ చెబుతా
  • పంద్రాగస్టులోగా రైతు రుణమాఫీ అమలు చేస్తాం
  • కొత్తగూడెం ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేంద్రంలోని ఏ సంకీర్ణంలో చేరతారో చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ‘కేసీఆర్‌.. బీజేపీలో చేరతారని మేం మొదటి నుంచీ చెబుతున్నాం. కేంద్రంలో బీజేపీ చేసిన అన్ని చట్టాలకు బీఆర్ఎస్ మద్దతిచ్చింది. కాంగ్రెస్‌ను అడ్డుకునేందుకు ఆ రెండు పార్టీలు కలిసి కుట్రలు చేస్తున్నాయి. గుజరాత్‌ను ఓడిద్దాం.. తెలంగాణను గెలిపించుకుందాం రండి. రైతు భరోసా ఆగిపోయిందని కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ నెల 9లోగా ఒక్క రైతుకైనా బకాయి ఉంటే క్షమాపణ చెబుతా. పంద్రాగస్టులోగా రైతు రుణమాఫీ అమలు చేసి హరీశ్‌రావు నోరు మూయిస్తాం. ప్రజలంతా రాహుల్‌గాంధీని ప్రధానిగా చూడాలని కోరుకుంటున్నారు. కేసీఆర్‌ వైఖరిని ఖమ్మం జిల్లా ప్రజలు ముందే పసిగట్టారు. అందుకే 2014, 2019, 2023లో బీఆర్ఎస్‌ను ఓడించారు. ఇక్కడి ప్రజలు చైతన్యవంతులు.. ముందుచూపు ఎక్కువ. పదేళ్ల పాటు తెలంగాణకు ద్రోహం చేసింది బీజేపీనే. ఈ పదేళ్లలో రాష్ట్రానికి ఒక్కటైనా ఇచ్చారా? రాజ్యాంగాన్ని మారుస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శే చెప్పారు. రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను కాపాడుకునేందకు కాంగ్రెస్‌ను గెలిపించాలి. తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిన కాషాయ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం’ అని రేవంత్ విమర్శలు గుప్పించారు.

Recent

- Advertisment -spot_img