ఇదే నిజం, బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణం కాంటా చౌరస్తాలో 7 కోట్ల 58 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన కూరగాయల మార్కెట్ ను బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి , పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ , జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన స్టాల్ వద్ద పార్లమెంట్ సభ్యులకు గడ్డం వంశీకృష్ణ , బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి కలిసి విక్రయిత వద్ద కూరగాయలను కొనుగోలు చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత ,ఆర్డీఓ హరికృష్ణ , మున్సిపల్ అధికారులు, సిబ్బంది, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు అధికారులు , కో అప్షన్ సభ్యులు, లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.