ఏపీలోని విశాఖ, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షానికి జిల్లాల యంత్రాంగం అప్రమత్తమైంది. ముందస్తు చర్యల్లో భాగంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు విద్యాశాఖ సెలవు ప్రకటించింది. జిల్లాల కలెక్టర్ల ఆదేశాల మేరకు సెలవు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే కృష్ణా జిల్లాలో కూడా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు, స్కూళ్లకు సెలవు ఇచ్చారు.