వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్‌జైన్ మరియు అధికారులపై దాడి ఘటనలో పోలీసులు సోమవారం అర్ధరాత్రి మరియు ఈ రోజు మొత్తం 52 మందిని అరెస్టు చేశారు. వారిని పరిగి పీఎస్కు తరలించినట్లు సమాచారం. దుద్యాల, బొంరాస్పేట, కొడంగల్ మండలాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. దాడి జరిగిన లగచర్ల గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. నిన్న ఫార్మా పరిశ్రమకు భూసేకరణ కోసం వెళ్లిన అధికారులపై గ్రామస్థులు దాడికి పాల్పడి, వాహనాలు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.