వికారాబాద్ జిల్లా లగచర్ల గ్రామంలో కలెక్టర్, అధికారులపై జరిగిన దాడి ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడిగా అనుమానిస్తున్న సురేశ్ అనే వ్యక్తి కాల్ డేటాను పోలీసులు పరిశీలించారు. ఇతను 42 సార్లు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో ఫోన్లో మాట్లాడినట్లు గుర్తించారు. సురేష్ తో మాట్లాడుతూ నరేందర్ రెడ్డి 6 సార్లు కేటీఆర్‌తో మాట్లాడినట్లు సమాచారం. కాగా సురేష్పా ఇప్పటికే రేప్ కేసుతో సహా పలు కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. నిందితుడి కోసం నాలుగు బృందాలు గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.