Homeహైదరాబాద్latest Newsఅసంపూర్తి నిలిచిన అంగన్వాడీ భవనాలను నిర్మించాలి : కంకణాల ప్రవీణ వెంకట్ రెడ్డి

అసంపూర్తి నిలిచిన అంగన్వాడీ భవనాలను నిర్మించాలి : కంకణాల ప్రవీణ వెంకట్ రెడ్డి

ఇదే నిజం దేవరకొండ : చింతపల్లి మండలం అసంపూర్తి నిలిచిన అంగన్వాడీ భవన నిర్మాణాలను పూర్తి చేయాలని నల్లగొండ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ చింతపల్లి జడ్పీటిసి కంకణాల ప్రవీణ వెంకట్ రెడ్డి అన్నారు.నల్లగొండ జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా పరిషత్ అధ్యక్షులు బండా నరేందర్ రెడ్డి ఏర్పాటు చేసిన సర్వ సభ్య సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు.ఇట్టి సమావేశానికి తెలంగాణ రాష్ట్ర శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర మంత్రి కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కోసం న్యాణమైన సన్న బియ్యం సరఫరా చేయాలని ఆమె కోరారు.గ్రామాల్లో కొన్ని చోట్ల మిషన్ భగీరథ నీళ్ళు సరిగా రాకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆమె అన్నారు.అధికారులు స్పందించి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు.

nalgonda ఇదేనిజం అసంపూర్తి నిలిచిన అంగన్వాడీ భవనాలను నిర్మించాలి : కంకణాల ప్రవీణ వెంకట్ రెడ్డి

Recent

- Advertisment -spot_img