‘గుంటూరు కారం’సినిమా టికెట్ల పెంపుతో పాటు బెనిఫిట్ షోలకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు నటించిన చిత్రం సంక్రాంతి సందర్భంగా ఈ 12న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రం మేకర్స్ బెనిఫిట్ షోలు, ధరల పెంపు కోసం ప్రభుత్వం అయితే గత నెలలో గుంటూరు కారం మూవీ టికెట్ల ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి సినిమా నిర్మాతలు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు సర్కారు అనుమతులు జారీ చేసింది. సింగిల్ స్క్రీన్లలో రూ.65, మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ.100 పెంచేందుకు అంగీకరించింది.
అలాగే బెన్‌ఫిట్ షోలకు అనుమతులు ఇచ్చింది. సింగిల్స్ స్క్రీన్స్‌లో రూ.65, మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ.100 ధరను పెంపునకు, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఈ నెల 12న అర్ధరాత్రి ఒంటి గంట నుంచి తెలంగాణ వ్యాప్తంగా 23 చోట్ల బెనిఫిట్ షోలు వేసుకునేందుకు పర్మిషన్ ఇస్తూ జీవో జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ‘గుంటూరు కారం’ థియేటర్లలో ఆరు షోలు వేసుకునేందుకు సైతం అనుమతి లభించింది. జనవరి 12 నుంచి 18వ తేదీ వరకు తెల్లవారుజామున 4 గంటల షోకు ప్రభుత్వం సర్కారు అవకాశం ఇచ్చింది.