వచ్చ నెల నుంచి పెన్షన్లు పెరగనున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు డిసెంబర్ 7వ తేదీకి ఏడాది పూర్తి కానుంది. ఆలోగా ఆసరా పెన్షన్ల పెంపు, రైతు భరోసా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. గత ప్రభుత్వం ఆసరా పింఛన్లకు రూ.2,016, వికలాంగ పింఛన్లకు రూ.3,016 ఇవ్వగా, తాము ఆసరా పింఛను రూ.4,000, వికలాంగ పింఛన్ రూ.6,000 చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. రైతు భరోసా కింద ఏటా ఎకరాకు రూ.15,000 అందిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.