కొంత కాలంగా ఉత్తరకొరియా దేశంలో కరువు విలయ తాండవం చేస్తుంది. దీన్ని అధిగమించేందుకు కిమ్ దేశ ప్రజలకు ఓ పిలుపునిచ్చాడు. దేశంలో ఆకలిని తీర్చేందుకు ప్రజలు వారి పెంపుడు కుక్కలను ప్రభుత్వానికి ఇచ్చేయాలని ఆదేశించాడు. అలా పెంపుడు కుక్కలను వాటి యజమానులు స్వచ్చందంగా ఇవ్వడం వల్ల ఆ కుక్కలను చంపి వాటి మాంసాన్ని హోటళ్లు, రెస్టారెంట్లలో చికెన్, మటన్ బిర్యానీల మాదిరిగా కుక్క బిర్యాని, కుక్క మాంసంతో చేసిన వంటకాలను ప్రజలకు అందించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే కొరియన్లకు కుక్క మాంసం తినడం సాదారణమే. మన దేశంలో కూడా కొన్ని ప్రాంతాల్లో కుక్క మాంసం తినే తెగలు ఉన్నాయి. ముఖ్యంగా నాగాలాండ్ రాష్ట్రంలో కుక్క మాంసం తింటారు. 2014 ఎలక్షన్ సమయంలో తెలంగాణలో ఈషాన్య రాష్ట్రాలకు చెందిన పలువురు రక్షణ సిబ్బంది సిరిసిల్ల వంటి ప్రాంతాల్లో కుక్కలు మిగలకుండా చేశారు.