Homeహైదరాబాద్latest Newsపెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేటు ఎంతంటే..?

పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేటు ఎంతంటే..?

పెళ్లిళ్లు, శుభకార్యాలు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది వెండి, బంగారమే. పసిడితో పాటు వెండికి కూడా మంచి గిరాకీ ఉంది. అందుకే వాటి ధరలను క్రమం తప్పకుండా తెలుసుకోవడం చాలా ముఖ్యం. మరి తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖ వంటి ప్రధాన నగరాల్లో వాటి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..ప్రస్తుతం బంగారం, వెండి ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈరోజు మాత్రం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. అయితే ఈరోజు బంగారం ధరలు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 870 పెరిగింది.. 22 క్యారెట్ల బంగారంపై 800 పెరిగింది. అయితే గత 5 రోజుల్లోనే 24 క్యారెట్ల బంగారం ధర రూ.3,170 పెరిగింది. ఈ క్రమంలో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. అక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,250 ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.78,820 వద్ద కొనసాగుతుంది. ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.72,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 78,970 ఉంది. ముంబై, కోల్‌కతా, బెంగళూరు వంటి నగరాల్లో.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 72,250, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 78,820 ఉండగా, చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 72,250 కాగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,820 కొనసాగుతుంది. అయితే శుక్రవారం వెండి ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ.1,01,000 ఉంది. అయితే చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,01,000 ఉండగా.కోల్‌కతా, ఢిల్లీ, ముంబై నగరాల్లో కిలో వెండి ధర రూ. 92,000 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర 92,000 వద్ద కొనసాగుతోంది.

Recent

- Advertisment -spot_img