హైదరాబాద్‌లో ఇళ్ల విక్రయాలు బాగా పెరిగిపోయాయి. ముక్యంగా ఈ సంవత్సరం ఆగస్టు నెలలో రూ.4,043 కోట్ల విలువైన గృహ విక్రయాలు నమోదయ్యాయి. గత సంవత్సరం ఇదే నెలతో పోలిస్తే 17 శాతం అధికమని ప్రముఖ రియల్‌ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ నైట్‌ఫ్రాంక్ ఇండియా నివేదిక వెల్లడించింది. మొత్తం 6,439 గృహాలు రిజిస్ట్రేషన్లు జరిగాయంది. గతేడాదితో పోల్చితే ఒక శాతం తక్కువ. ఈ ఏడు ఇప్పటివరకు మొత్తం 54,483 గృహాలు అమ్ముడైనట్లు నివేదిక తెలిపింది.