Homeహైదరాబాద్latest Newsఏపీలో పెరిగిన పోలింగ్ శాతం.. ఎవరికి అనుకూలం?

ఏపీలో పెరిగిన పోలింగ్ శాతం.. ఎవరికి అనుకూలం?

ఏపీ ఎన్నికల చరిత్రలో సంచలన రికార్డు నమోదైంది. పోటెత్తిన ఓటర్లతో బ్యాలట్లేకాదు.. రికార్డులు సైతం బద్దలయ్యాయి. ఏపీలో 81.76 శాతం పోలింగ్ నమోదైనట్టు ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ప్రకటించారు. దీనిలో సాధారణ ఓటింగ్‌ 80.07 శాతం కాగా, పోస్టల్‌ బ్యాలెట్‌ 1.1 శాతంగా ఉంది. 2019 ఎన్నికల్లో 79.88 శాతం, 2014 ఎన్నికల్లో 77.96 శాతం పోలింగ్ నమోదైంది. తుది లెక్కలు తేలితే 82 శాతం దాటుతుందని ఈసీ చెబుతుంది.

పెరిగిన పోలింగ్ శాతం.. ఎవరికి అనుకూలం?
పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి కలిసొస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. ప్రజా వ్యతిరేకత కారణంగా ఓటర్లు పోలింగ్ బూత్‌లకు పోటెత్తారని.. ఇది తమకే లబ్ధి కలిగిస్తుందని ప్రతిపక్షం చెబుతుంటే.. మహిళలు, వృద్ధులకు తమ పాలనలో సంక్షేమ పథకాలు అందాయని.. వారు చివరి వరకూ ఓపికగా లైన్లలో నిలబడి ఓటేశారని.. ఇది తమ ప్రభుత్వానికి పాటిజివ్ ఓటు అని వైఎస్సార్సీపీ పూర్తి నమ్మకంగా చెబుతోంది.

నేతల్లో టెన్షన్.. ఓటరు మాత్రం కూల్
జనం తమ తీర్పును ఈవీఎంలలో బంధించారు. దీంతో రాజకీయ పార్టీలు, నేతల్లో టెన్షన్ కొనసాగుతుండగా.. ఓటరు మాత్రం కూల్ అయిపోయాడు. తాను ఎలాంటి తీర్పు ఇవ్వాలనుకున్నాడో పోలింగ్ బూత్‌కు వెళ్లి తన తీర్పును రిజర్వు చేసి వచ్చాడు. జూన్‌ 4న అసలు తీర్పు వెల్లడికానుంది. ఓటరు ఏ పార్టీని ఆదరించాడనేది మరో 20 రోజుల్లో తెలుస్తుంది. అప్పటివరకు నాయకుల్లో టెన్షన్ కొనసాగనుంది.

Recent

- Advertisment -spot_img