తెలంగాణాలో చలి తీవ్రత పెరుగుతోంది. కొన్నిరోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో చలి ప్రభావం ఎక్కువవుతోంది. సోమవారం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం గిన్నెధరిలో 12.0డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్ శివారులోని ఇబ్రహీంపట్నం, మహేశ్వరం ప్రాంతాల్లో 12.6డిగ్రీలు నమోదు కావడం విశేషం. వికారాబాద్ జిల్లాలోని మర్పల్లి, రంగారెడ్డి జిల్లా చందన్వెల్లిల్లో వరుసగా రెండోరోజు 12.2డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి.