Homeహైదరాబాద్latest Newsదేశంలో పెరుగుతున్న వివాహేతర సంబంధాలు.. అధ్యయనంలో తేలిన నమ్మలేని నిజాలు

దేశంలో పెరుగుతున్న వివాహేతర సంబంధాలు.. అధ్యయనంలో తేలిన నమ్మలేని నిజాలు

వివాహ వ్యవస్థను మన దేశంలో ఎంతో పవిత్రంగా భావిస్తారు. కానీ, ఈ రోజుల్లో వివాహేతర సంబంధాలు ఎక్కువైపోతున్నాయి. కట్టుకున్న భర్త/భార్యను, పుట్టిన పిల్లల్నీ పట్టించుకోకుండా చాలా మంది వివాహేతర సంబంధాలకే ఎక్కువ ఎట్రాక్ట్ అవుతున్నారు. భర్త తాగుతున్నాడనో, కొడుతున్నాడనో.. భార్య మాట వినడం లేదనో ఇలా చిన్న చిన్న కారణాల చేత.. వేరే వాళ్లపై ప్రేమను పెంచుకుని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. 5 నిమిషాల పడక సుఖం కోసం చాలా మంది ప్రాణలు తీస్తున్నారు.. లేదంటే ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

దీనిపై తాజా సర్వేలో భారతదేశంలోని వివాహిత వ్యక్తులు.. ఎక్కువగా వివాహేతర సంబంధాలకే ఇష్టపడుతున్నట్లు తేలింది. దీనికోసం టైర్1, టైర్2 నగరాల నుంచి 25 నుంచి 50 సంవతర్సాల మధ్య వయసుగలవారైన దాదాపు 1500 మందిపై ఈ సర్వే నిర్వహించింది. ఇందులో 60 శాతం మంది డేటింగ్ వైపే ఎక్కువ మక్కు చూపుతున్నారట. అంతే కాకుండా 46 శాతం మంది పురుషులు అలాంటి సంబంధాలను ఇష్టపడుతున్నారని ఈ అధ్యయనంలో తేలింది. ఇక మహిళల విషయానికి వస్తే 35 శాతం మంది వేరే వాళ్లతో ఉండేందుకు ఇష్టపడుతున్నారట.

Recent

- Advertisment -spot_img