అండర్-19 ఆసియాకప్ వన్డే టోర్నీలో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 281/7 పరుగులు చేసింది. టీమిండియాకు 282 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. షాజైబ్ ఖాన్ 159, ఉస్మాన్ ఖాన్ 60 పరుగులు చేశారు. భారత బౌలర్లలో సమర్థ్ నాగరాజ్ 3, ఆయుష్ మాత్రే 2 వికెట్లు, కిరణ్, యుధజిత్ గుహ చెరో వికెట్ పడగొట్టారు.