బోర్డర్ గావస్కర్ ట్రోఫిలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్ట్ డిసెంబర్ 14న బిస్బేన్(గబ్బా) వేదికగా ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్‌కు వరణుడు అంతరాయం కలిగించే అవకాశముంది. ఈ టెస్ట్ మ్యాచ్ జరగనున్న ఐదు రోజుల్లోనూ 40శాతం వర్షం కురిసే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. కాగా, అయిదు మ్యాచ్‌ల బోర్డర్-గావస్కర్ సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది.