చెన్నైలోని చెపాక్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్టులో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 149 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులు చేసిన విషయం తెలిసిందే. దీంతో రోహిత్ సేన 227 పరుగుల ఆధిక్యం సాధించింది. భారత బౌలర్లలో బుమ్రా 4 వికెట్లు తీసుకోగా.. ఆకాశ్, జడేజా, సిరాజ్ తలో రెండు వికెట్లు సాధించారు. బంగ్లా బ్యాటర్లలో శాంటో 20, షకీబ్ 32, లిటన్ 22, మెహిదీ 27* మాత్రమే రాణించారు.