IND vs ENG 1st ODI: నాగ్‌పూర్‌లో భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన తొలి వన్డేలో ఇంగ్లాండ్ 248 పరుగులకు ఆలౌట్ అయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడంతో ఇంగ్లాండ్‌కు మంచి ఆరంభం లభించింది. అయితే హర్షిత్ రాణా, జడేజా కీలక వికెట్లు తీసి ఇంగ్లాండ్ బ్యాటింగ్‌ను దెబ్బతీశారు.ఇంగ్లాండ్ బ్యాటింగ్ లో బట్లర్ (52), జాకబ్ (51), సాల్ట్ (43) తప్ప మిగతా బ్యాట్స్‌మెన్ తక్కువ స్కోర్‌లకే అవుట్ అయ్యారు. ఇంగ్లాండ్ జట్టు భారత్ 249 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.