IND vs Eng 1st T20I: భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ కాసేపట్లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది. అయితే ఈ మైదానంలో భారత జట్టుకు టీ20ల్లో మెరుగైన రికార్డు ఉంది. ఈ గ్రౌండ్‌లో ఇప్పటివరకు భారత్ ఏడు టీ20 మ్యాచ్‌లు ఆడింది. అందులో కేవలం ఒక్కదాంట్లో మాత్రమే ఓడిపోయింది. అది కూడా ఇంగ్లాండ్‌తోనే కావడం గమనార్హం. 2011లో ఈ మ్యాచ్ జరిగింది. 2011 నుంచి ఇప్పటివరకు జరిగిన టీ20ల్లో టీమిండియా విజయం సాధించింది.
IND vs Eng 1st T20I: ఆ రికార్డుకి 2 వికెట్ల దూరంలో అర్ష్‌దీప్
ఈ టీ20 సిరీస్‌లో టీమిండియా యంగ్ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ మరో రికార్డుకు రెండు అడుగుల దూరంలో నిలిచాడు.నేటి మ్యాచ్‌లో 2 వికెట్లు తీస్తే ఇండియా తరఫున టీ20ల్లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్‌గా అర్ష్‌దీప్ నిలుస్తాడు. 2022లో ఇంటర్నేషల్ క్రికెట్‌కు ఎంట్రీ ఇచ్చిన అర్ష్‌దీప్ సింగ్ 60 టీ20 మ్యాచుల్లో 95 వికెట్లు తీశాడు.
ALSO READ: రేపు బ్యాంకులకు సెలవు.. ఎక్కడంటే?