IND vs Eng 2nd T20: ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో రెండో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉన్న భారత్.. లీడ్‌ను మరింత పెంచుకోవాలని భావిస్తోంది. అయితే ఈ మ్యాచ్‌లో భారత పేసర్ షమీ ఆడతాడా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. చెన్నై పిచ్ స్పిన్‌తో పాటు పేస్‌కు కూడా అనుకూలంగా ఉండనుంది. దీంతో తుది జట్టులోకి షమీని తీసుకోవాలని భారత్ భావిస్తోంది. దీంతో రవి బిష్ణోయ్ స్థానంలో మహమ్మద్ షమీ రీఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది.
IND vs Eng 2nd T20 భారత్ ప్లేయింగ్ XI(అంచనా): అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (WK), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (c), హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, అక్షర్ పటేల్, నితీష్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ/రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి.
ALSO READ: Virat Kohli : టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి గాయం