Homeహైదరాబాద్latest NewsIND VS ENG 3rd ODI: మూడో వన్డే తుది జట్టులో కీలక మార్పులు.. ఆ...

IND VS ENG 3rd ODI: మూడో వన్డే తుది జట్టులో కీలక మార్పులు.. ఆ స్టార్ ప్లేయర్ అవుట్.. రిషభ్ పంత్..!

IND VS ENG 3rd ODI: తొలి రెండు మ్యాచ్ లలో సాధించిన విజయాలతో ఉత్సాహంగా ఉన్న టీమిండియా ఇప్పుడు మూడో వన్డేలో గెలిచి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్ కు తుది జట్టులో అనేక మార్పులు ఉంటాయి. బెంచ్ బలాన్ని పరీక్షించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇంగ్లాండ్‌పై ఇప్పటికే వన్డే సిరీస్ గెలుచుకున్న ఇండియా రేపు జరగబోయే మూడే వన్డేలోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో తుది జట్టులో పలు మార్పులతో బరిలోకి దిగనుంది. త్వరలోనే ఛాంపియన్స్ ట్రోఫి ప్రారంభం కానుండడంతో సిరీస్‌లో ఇప్పటివరకు ఆడని వికెట్‌ కీపర్ రిషభ్ పంత్, ఫాస్ట్‌ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్, ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌, కుల్దీప్ యాదవ్‌లకు తుది జట్టులో చోటు కల్పించనుంది.
IND VS ENG 3rd ODI టీమిండియా ప్లేయింగ్ XI (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్య, రిషభ్‌ పంత్ (వికెట్‌కీపర్), వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్‌దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్.

Recent

- Advertisment -spot_img