IND VS ENG 3rd ODI: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచులో ఓపెనర్ శుభమన్ గిల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 95 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్‌తో 102 పరుగులు చేశాడు. రెండో ఓవర్‌లోనే రోహిత్ శర్మ అవుట్ కాగా కోహ్లీ, గిల్ టీమిండియాకు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. మరో వైపు కోహ్లీ (52) హాఫ్ సెంచరీ చేసి వెనుతిరిగాడు. ప్రస్తుతం శుభమన్ గిల్(102), శ్రేయాస్ అయ్యర్(43) క్రిజ్ లో ఉన్నారు. దీంతో ఇండియా 31.2 ఓవర్లకు 206/2 స్కోరు చేసింది.