Homeహైదరాబాద్latest NewsIND VS ENG: అరుదైన రికార్డు పై కన్నేసిన హిట్‌మ్యాన్.. మరో 13 పరుగులు చేస్తే...

IND VS ENG: అరుదైన రికార్డు పై కన్నేసిన హిట్‌మ్యాన్.. మరో 13 పరుగులు చేస్తే చాలు..!

IND VS ENG: తొలి రెండు మ్యాచ్ లలో సాధించిన విజయాలతో ఉత్సాహంగా ఉన్న టీమిండియా ఇప్పుడు మూడో వన్డేలో గెలిచి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్ కు తుది జట్టులో కీలక మార్పులు ఉంటాయని తెలుస్తుంది. అయితే ఈ మ్యాచ్ లో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. అతను మరో 13 పరుగులు చేస్తే వన్డేల్లో అత్యంత వేగంగా 11,000 పరుగులు చేసిన రెండో ఆటగాడిగా రికార్డు సృష్టించే అవకాశం ఉంది. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. కోహ్లీ 222 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఫీట్ సాధించాడు. రోహిత్ 259 ఇన్నింగ్స్‌ల్లో 10,987 రన్స్‌ చేశాడు. దీంతో రేపు ఇంగ్లాండ్‌తో జరిగే మ్యాచులో 13 పరుగులు చేస్తే ఈ భారీ రికార్డు క్రియేట్ చేసే అవకాశముంది.

Recent

- Advertisment -spot_img