IND vs ENG : నేడు నాగ్‌పూర్‌లో తొలి వన్డేలో భాగంగా టీమిండియా, ఇంగ్లాండ్ (IND vs ENG) మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా ఘనంగా విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ 248 పరుగులకు ఆలౌట్ అయింది. 249 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా 38.4 ఓవర్లో 251 పరుగులు చేసి విజయం సాధించింది. టీమిండియా బ్యాటర్లు శుభ్‌మాన్ గిల్ 87 పరుగులు, శ్రేయాస్ అయ్యర్ 59, అక్షర్ పటేల్ 52 పరుగులు చేసారు. అలాగే యశస్వి జైస్వాల్క్ 15 , రోహిత్ శర్మ 2, హార్దిక్ పాండ్యా 9, రవీంద్ర జడేజా 12 పరుగులు చేసారు.