ఏపీ సీఎం చంద్రబాబు పట్టువస్త్రాలు తలపై పెట్టుకొని ఉన్న షార్ట్ వీడియోని అప్లోడ్ చేసి “దేవుడికి ఇష్టంలేదని స్పష్టంగా కనిపిస్తుంది, మళ్ళీ చెప్తున్నా ప్రాణగండం ఉంది” అని ఒక వ్యక్తి అసభ్యకర ట్వీట్ చేసాడు. పవిత్ర కార్యక్రమం గురించి తప్పుడు పోస్ట్ పెట్టడంపై టీటీడీ సీరియస్ అయింది. టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగేలా, ఒక వర్గం ప్రజలను రెచ్చగొట్టేలా ట్వీట్ చేసిన ఆ వ్యక్తి అకౌంట్ నిర్వహకుడు చైతన్యపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసారు.