INDIA:ఐక్యరాజ్య సమితి స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ 2023 పేరుతో జనాభా లెక్కలను విడుదల చేసింది. అందులో ప్రపంచంలోని అన్ని దేశాలకంటే భారతదేశ జనాభానే ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. జనాభాలో చైనాను దాటిన భారత్.. అత్యదిక జనాభా కలిగిన దేశంగా టాప్ ప్లేస్ లో నిల్చింది. ప్రస్తుతం చైనా జనాభా 142.57 కోట్లు ఉంటే.. భారత్ జనాభా 142.86 కోట్లకు చేరుకుంది. అయితే, భారత్.. చైనా జనాభాను ఎప్పుడు దాటిందో మాత్రం స్పష్టం చేయలేదు.
ఐక్యరాజ్య సమితి బుధవారం విడుదల చేసిన లెక్కల్లో.. ఈ ఏడాది మధ్యలోనే 29 లక్షల జనాభాతో భారత్ చైనాను అధిగమించినట్లు తెలిపింది. అయితే, గతంలో ఎన్నడూ భారత్ చైనా జనాభాను అధిగమించలేదు. జనాభా పరంగా భారత్, చైనా దేశాల తర్వాత 340 మిలియన్ల జనాభాతో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మూడో స్థానంలో నిలిచినట్లు ఐక్యరాజ్య సమితి నివేదికలో వెల్లడించింది.