HomeజాతీయంINDIA:కేంద్రంపై అవిశ్వాసం?

INDIA:కేంద్రంపై అవిశ్వాసం?

కేంద్రంపై అవిశ్వాసం?

  • మణిపూర్ అంశంపై ప్రభుత్వంపై ఒత్తిడి
  • ఒక్కటైన విపక్షాలు
  • ప్రధాని ప్రకటన చేయాలని డిమాండ్

ఇదేనిజం, స్టేట్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వంపై విపక్ష కూటమి అవిశ్వాస తీర్మానం పెట్టే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా విపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. మణిపూర్ లో ఎన్నో రోజులుగా అల్లర్లు జరుగుతున్నా కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించినప్పటికీ విపక్షాలు వెనక్కి తగ్గడం లేదు. మణిపూర్ హింసపై ప్రధాని మోడీ పార్లమెంట్ వేదికగా స్పందించాలని కోరుతున్నాయి. ఇదిలా ఉంంటే తాజాగా విపక్షాలు కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కేంద్ర ప్రభుత్వాన్ని మరింత ఇరుకున పెట్టేలా అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలని విపక్షాలు యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img