భారత్ – బంగ్లాదేశ్ రెండో టెస్టు మూడో రోజు ఆట కూడా రద్దైంది. మ్యాచ్ జరుగుతున్న కాన్పూర్‌లో ఇవాళ వర్షం లేకపోయినా.. మైదానం చిత్తడిగా ఉండటంతో ఆట నిర్వహణకు సాధ్యపడలేదు. దీంతో ఒక్క బంతి కూడా పడకుండానే ఆటను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. తొలి రోజు కేవలం 35 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేస్తున్న బంగ్లాదేశ్ 107/3 స్కోరుతో ఉంది.