Homeఅంతర్జాతీయంIndia-China:చైనా చేతుల్లోకి భారత్‌ భూభాగ0

India-China:చైనా చేతుల్లోకి భారత్‌ భూభాగ0

India-china :పొరుగు దేశాల భూభాగాన్ని కొద్దికొద్దిగా ఆక్రమించాలన్న చైనా ఎత్తులను నిలువరించటంలో భారత్‌ ఘోరంగా విఫలమైందని మరోసారి వెల్లడైంది. తూర్పు లఢక్‌లో 65 పెట్రోలింగ్‌ పాయింట్ల (పీపీ)కు గాను 26 చోట్లకు భారత భద్రతా దళాలు వెళ్లక చాలా కాలమైందని లఢక్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి పీడీ నిత్య నిర్వహించిన పరిశీలనలో తేలింది. ఈ 26 పీపీల్లో చైనా సైన్యం పాగా వేయటమే కాకుండా భారత సైన్యం, పౌరులు అటువైపు వెళ్లకుండా కొండ శిఖరాలకు అత్యాధునిక కెమెరాలు కూడా అమర్చిందని ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన ఐపీఎస్‌ అధికారుల వార్షిక సదస్సులో ఆమె సమర్పించిన పరిశోధనా పత్రంలో తెలిపారు. 5 నుంచి 17, 24 నుంచి 32, 37 పీపీలకు భారత బలగాలు పెట్రోలింగ్‌ కోసం వెళ్లటం లేదని పేర్కొన్నారు. ‘భారత బలగాలు, పౌరులెవరూ ఆ ప్రాంతాలకు చాలాకాలంగా వెళ్లటం లేదని చైనా సైన్యం కూడా అంగీకరించింది.

ఈ ప్రాంతాల్లో ఇప్పుడు చైనీయులు కనిపిస్తున్నారు. దీంతో భారత బలగాల ఆధీనంలో ఉన్న సరిహద్దులో స్పష్టమైన మార్పు వచ్చింది. ఈ పీపీల్లో ఏర్పాటుచేసిన బఫర్‌ జోన్లు కూడా ఇప్పుడు చైనా చేతుల్లోకి వెళ్లిపోయాయి. సలామీ ైస్లెసింగ్‌ పేరుతో కొద్దికొద్దిగా భారత్‌ భూభాగం ఆక్రమించేందుకు పీఎల్‌ఏ వేసిన ఎత్తులు విజయవంతమయ్యాయి’ అని ఆ నివేదికలో పేర్కొన్నారు. ‘బఫర్‌ జోన్లను పీఎల్‌ఏ అవకాశంగా తీసుకొన్నది. బలగాల ఉపసంహరణ చర్చల సందర్భంగా ఆ ప్రాంతాల్లోని ఎత్తయిన పర్వతాలపై కెమెరాలు ఏర్పాటుచేసి బఫర్‌ జోన్లలోకి భారత బలగాలను రాకుండా అడ్డుకొంటున్నది. ఆ ప్రాంతం కూడా తమదేనని చెప్తూ, భారత సైన్యా న్ని మరింత వెనక్కు వెళ్లి కొత్తగా మరో బఫర్‌జోన్‌ను ఏర్పాటుచేయాలని ఒత్తిడి తెస్తున్నది’ అని నిత్య వివరించారు.

Recent

- Advertisment -spot_img