న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా ఇండియాకు వస్తున్న మద్ధతును చైనా ఓర్చుకోలేకపోతుందా.. ఇండియాతో చైనా యుద్ధాన్ని కోరుకుంటుందా.. ఇటీవల రష్యాలో సైనిక కవాతులో పాల్గొనేందుకు ఇండియా నిరాకరించినందుకు బదులు తీర్చుకుంటుదా.. చైనా వ్యవహార శైలిని పరిశీలిస్తే ఇలాంటి అనుమానాలే కలుగుతున్నాయి. లద్దాఖ్‌లోని పాంగాంగ్ సరస్సు దక్షిణ భూభాగంలో ఆగస్టు 29 ఆర్థరాత్రి సమయంలో మరోసారి చైనా సైనికులు సరిహద్దు రేఖను బలవంతంగా మార్చేందుకు ప్రయత్నించడం పైగా ఏకంగా 200 మంది సైనికులు, యుద్ధ ట్యాంకులు, మందుగుండు సామగ్రితో రావడం చూస్తే చైనా ఇండియాతో యుద్ధాం చేసైనా సరే ఫింగర్ 2 వరకు పాంగాంగ్ సరస్సుపై పట్టు సాధించేందుకు చైనా పావులు కదుపుతున్నట్లు యుద్ధ రంగ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మారిన చైనా వ్యూహం
ఇన్నాళ్లూ పాంగాంగ్ సరస్సు ఉత్తర ప్రాంతానికే పరిమితం అయిన చైనా ఆర్మీ అక్కడ ఇండియా సైన్యం నుంచి గట్టి వ్యతిరేకత రావడంతో వ్యూహం మార్చింది. దక్షిణ భాగంపై దృష్టి సారించి అక్కడ యథాతథ స్థితిని మార్చేందుకు అర్ధరాత్రి ప్రయత్నాలు చేయడం తాజా ఆందోళనకు కారణంగా నిలిచింది. దీనిపై భారత్ ఆర్మీ పీఆర్‌ఓ కల్నల్ ఆమన్ ఆనంద్ స్పందిస్తూ ‘చైనా ఆర్మీ కదలికలను ముందుగానే గుర్తించి పటిష్ట చర్యలు తీసుకున్నామని, చైనా వ్యూహాలను భగ్నం చేశాం. బ్రిగెడ్ కమాండర్ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. బారత్ శాంతిని నెలకొల్పేందుకు కట్టుబడి ఉందని’ అన్నారు. చైనా పాల్పడే ఎటువంటి దుస్సాహసాన్నైనా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలని సరిహద్దుల్లోని సీనియర్ కమాండర్లకు ఆర్మీ చీఫ్ ఎంఎం నరవానే కీలక ఆదేశాలు జారీ చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
ముందురోజే బార్డర్‌కు జే20 ఫైటర్ ప్లేన్స్
తూర్పు లద్దాఖ్‌లో రెండు నెలల క్రితం నెలకొన్న ఘర్షణ పూరిత వాతావరణం ఇంకా పూర్తిగా సమసిపోకముందే చైనా మరోసారి తన దుర్బుద్ధిని ప్రదర్శించిడం చైనా విస్తరణ వాదాన్ని తెలియజేస్తుందని విశ్లేషకులు అభిప్రాయబడుతున్నారు. గల్వాన్ ఘర్షణకు కారణమైన సైనిక ట్రూపులను అక్కడి నుంచి చైనా ఇంకా తరలించలేదు. ఇంతలోనే పాంగాంగ్ దక్షిణ ప్రాంతంలో ఉద్రిక్తలు మరోసారి చైనా వైఖరిపై పలు అనుమానాలకు దారితీస్తోంది. ఆగస్టు 29న పాంగాంగ్ ఘటనకు ముందురోజు చైనా వాయుసేన తన జే-20 యుద్ధవిమానాలను లద్దాఖ్ సరిహద్దులకు తరలించడం కూడా చైనా ముందస్తు వ్యూహాన్ని తెలియజేస్తోందని ఆర్మీ వర్గాలు అంటున్నాయి.
ఇరు దేశాలకు పాంగాంగ్ కీలక ప్రాంతం
సుమారు 134 కిలోమీటర్ల పొడవున్నపాంగాంగ్ సరస్సు లద్దాఖ్ కీలక ప్రాంతంలో ఉంది. 5 కిలోమీటర్ల వెడల్పు 604 చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించిన ఈ సరస్సు లో దాదాపు 60శాతం టిబెట్ భూభాగంలోనే ఉంటుంది. ఈ సరస్సు ఉత్తర తీరాన బంజరు పర్వతాలు ఉన్నాయి. వీటిని ఇరు దేశాల సైన్యాలు ‘ఫింగర్స్’గా చెబుతుంటారు. ఇండియాకు ‘ఫింగర్4’ చాలా కీలకమైంది. అక్కడికి గస్తీ కోసం ఇండియా సైన్యాన్ని వెళ్లేందుకు చైనా సైనికులు అడ్డుపడుతున్నారు. ఫింగర్ 2 వరకు చైనాదని వాదిస్తుంటారు. ప్రస్తుతం ఫింగర్ 2–3 మధ్య చైనా రోడ్డును నిర్మిస్తుంది. దీని సాయంతో చైనా సైనికులు ఇండియా కంటే వేగంగా ఫింగర్2 వద్దకు రాగలుగుతారు.
చైనా యుద్ధాన్ని కోరుకుంటుదా?
RELATED ARTICLES