ఉద్రిక్తతగా తూర్పు లడఖ్ సెక్టార్
న్యూఢిల్లీః ఇండియా, చైనా సైనికుల మధ్య కాల్పులు జరిగాయి. తూర్పు లడఖ్ సెక్టార్‌లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్‌ఐసి) లో ఈ ఘటన జరిగినట్టు సమాచారం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉంది. గత మూడు నెలలుగా తూర్పు లడఖ్‌లో ఇండియా, చైనా మధ్య చాలా ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉన్న సంగతి తెలిసిందే.
ఇండియాపై ఆరోపణలు
పాంగోంగ్ త్సో యొక్క దక్షిణ భాగంలో ఇండియన్ ఆర్మీ చొరబడటానికి ప్రయత్నించాయని చైనా ప్రభుత్వ మౌత్ పీస్ మీడియా గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. ఈ సమయంలో చైనా సైన్యం పెట్రోలింగ్ పార్టీ ఇండియన్ సైనికులతో మాట్లాడటానికి ప్రయత్నించినప్పుడు, వారు ప్రతిస్పందనగా హెచ్చరిక షాట్లను కాల్చారని చైనా ఆరోపిస్తుంది. అయితే కాల్పులపై ఇండియా నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఇండియా, చైనా దళాల మధ్య ఫైరింగ్
RELATED ARTICLES