- దురదృష్ట ఘటన అని వ్యాఖ్య
న్యూఢిల్లీః గల్వాన్ లోయలో జూన్ 15న చైనా సైనికులు అక్రమంగా చొరబడి 20 మంది ఇండియన్ సైనికులను హతమార్చిన సంఘటనపై తాజాగా చైనా పశ్చాతాప వైఖరిని ప్రదర్శిస్తుంది. ఆ ఘటన దురదృష్టకరమని వ్యాఖ్యనిస్తూ మొసలి కన్నీరు కారుస్తుంది. ఇండియాలోని చైనా రాయబారి సున్ వీడోంగ్ ఇటీవల నిర్వహించిన చైనా-ఇండియా యూత్ వెబినార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..గల్వాన్ లోయ ఘటన చరిత్రలో చిన్న దురదృష్ట ఘటనగా అభివర్ణించారు. ఏ దేశమైనా స్వంతంగా అభివృద్ధి సాధించడం కష్టమని, ఇండియాను ఓ భాగస్వామిగా చైనా చూస్తోందన్నారు. 70 ఏండ్ల నుంచి సరిహద్దు సమస్యలు ఉన్నాయని వాటిని సరైనా వేదికలపై పరిష్కరించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని గుర్తుచేశారు. సంప్రదింపుల ద్వారానే ద్వైపాక్షిక సంబంధాలను మెరుగు పరుచుకునేందుకు కృషిచేస్తామన్నారు. ఇండియా-చైనా సైనిక కమాండర్ల ఆధ్వర్యంలో ప్రస్తుతం జరుగుతున్న మీటింగ్‌లు చైనా సైనికాధికారుల మొండివైఖరి కారణంగా సరైనా ఫలితం ఇవ్వడం లేదని ఇండియన్ ఆర్మీ అధికారులు పేర్కొనడం గమనార్హం.
గల్వాన్ ఘర్షణపై చైనా పశ్చాతాపం!
RELATED ARTICLES