Homeజాతీయంరష్యాతో భారత్​ది 60 ఏళ్ల నాటి బంధం

రష్యాతో భారత్​ది 60 ఏళ్ల నాటి బంధం

– ఆ మైత్రినే ఎన్నోసార్లు కాపాడింది
– కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: భారత్‌ – రష్యా మధ్య ఏళ్ల నాటి మైత్రి ఉందని.. అది అకస్మాత్తుగా ఏర్పడింది కాదని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌. జైశంకర్‌ అన్నారు. దానివల్ల ఢిల్లీకి నష్టం కలిగిందనే భావన సరికాదని వ్యాఖ్యానించారు.‘మనకు రష్యాతో సంబంధం ఉంది. ఆ బంధం ఒక్క రోజులో ఏర్పడింది కాదు. అది 60 ఏళ్లుగా కొనసాగుతోంది. ఈ 50-60 ఏళ్లకాలంలో ప్రపంచ రాజకీయ గమనం.. ఆ మైత్రిని మరింత బలోపేతం చేసేందుకు ఉపకరించింది. రష్యాతో స్నేహం వల్ల ఢిల్లీకి నష్టం జరిగిందనే భావన సరికాదు. ఆ బంధమే ఎన్నోసార్లు కాపాడింది’అని మంగళవారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన వ్యాఖ్యానించారు. గతేడాది ప్రారంభం నుంచి ఉక్రెయిన్‌ – రష్యా మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధం విషయంలో ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వాలని వెస్ట్రన్ కంట్రీస్ నుంచి వచ్చిన ఒత్తిడిని తట్టుకొని భారత్ స్వతంత్ర వైఖరిని ప్రదర్శించింది. సార్వభౌమత్వం, దేశ ఆర్థిక ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చింది. చర్చల ద్వారా ప్రతి సమస్యకు పరిష్కారం కనుగొనాలని సూచించింది. ఈ నేపథ్యంలో జై శంకర్ చేసిన వ్యాఖ్యలు వెస్ట్రన్ కంట్రీస్​కు కాస్త మింగుడుపడవనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Recent

- Advertisment -spot_img