రెండో సారి రికార్డు స్థాయిలో కొత్త కేసులు
ఒకేరోజు 1096 మంది మృతి
న్యూఢిల్లీః దేశంలో కరోనా విలయం కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో అత్యధికంగా 1096 మంది కరోనా రోగులు మృత్యువాత పడగా కొత్తగా 83,341 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర కుటుంబ, సంక్షేమ శాఖ తెలిపింది. దేశంలో కొత్త కేసులు 80 వేలు దాటడం ఇది రెండోసారి. దేశంలో కరోనాతో మరణించిన వారిసంఖ్య 68,472కు చేరుకుంది. మొత్తం కరోనా కేసుల సంఖ్య 39,36,748కి చేరింది. ఇందులో 8,31,124 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు కరోనా బారినపడి కోలుకున్న వారిసంఖ్య 30,37,152గా ఉంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 66వేల మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజా లెక్కలతో కలిపి దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 77శాతం కాగా.. మరణాల రేటు 1.7శాతంగా ఉంది.