– ముంబై వాంఖడే స్టేడియం వేదికగా మ్యాచ్
– టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
ఇదేనిజం, స్పోర్ట్స్ డెస్క్ : వరల్డ్‌కప్‌లో వరుస విజయాలతో సెమీస్‌లో అడుగుపెట్టిన టీమిండియా బుధవారం న్యూజిలాండ్‌తో తలపడనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ తీవ్ర ఉత్కంఠగా సాగనుంది. ఎందుకంఏ భారత్-న్యూజిలాండ్ జట్లు రెండూ బలంగా ఉన్నాయి. టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలంగా ఉంది. కివీస్ కూడా బ్యాటింగ్‌తోపాటు పేస్ అటాక్‌తో ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెడుతుంది. అయితే ఈ పిచ్‌పై టాస్ గెలిచిన జట్టు తొలుత బ్యాటింగ్ చేస్తే భారీ స్కోరు సాధిస్తుందనే నమ్మకంతో భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తద్వారా ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచడంతోపాటు స్కోరును కాపాడుకునే అవకాశం ఉందని భావిస్తుంది. ఇదే స్టేడియంలో 358 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకను భారత్ 55 పరుగులకే కుప్పకూల్చింది.