బీజింగ్ః దేశ సార్వభౌమత్వం, రక్షణకు ముప్పుందని చైనాకు చెందిన పబ్జీ సహా మొత్తం 118 యాప్‌లపై ఇండియా నిషేధం విధించింది. దీనిపై తాజాగా చైనా వాణిజ్య వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి గో ఫెంగ్ స్పందించారు. ఇండియా తీసుకున్న నిర్ణయాలు ఇన్సెస్టర్స్, సర్వీస్ ప్రొవైడర్ల చట్టబద్ధమైన ప్రయోజనాలను దెబ్బతీసేవిగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ తప్పును భారత్ సరిచేసుకోవాలని చైనా కోరుకుంటోందని తెలిపారు. భారత్-చైనా సరిహద్దుల్లో తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో పబ్జీ సహా 118 చైనా యాప్‌లపై నిషేధంతో భారత్ నిషేధించిన చైనా యాప్‌ల సంఖ్య 224కు పెరిగింది. లడఖ్ సరిహద్దు వివాదం నేపథ్యంలో జూన్ 29న టిక్‌టాక్, యూసీ బ్రౌజర్ సహా 59 చైనా యాప్‌లను ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే.