భారతదేశం మొదటిసారిగా ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద 5G మొబైల్ మార్కెట్‌గా అవతరించింది. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక ప్రకారం, గ్లోబల్ 5G మొబైల్ వినియోగం గత సంవత్సరంతో పోలిస్తే 2024 ప్రథమార్థంలో 20 శాతం పెరుగుతుందని పేర్కొంది. అలాగే 5జీ ఫోన్లలో యాపిల్ మొబైళ్లను ఎక్కువగా వాడుతున్నారని పేర్కొంది. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా 5జీ మొబైళ్లు వాడుతున్న దేశాల్లో అమెరికా తర్వాత భారత్ రెండో స్థానంలో నిలిచింది.