భారత్ స్థానికంగా అభివృద్ధి చేసిన, భద్రమైన వెబ్ బ్రౌజర్ ను భారతీయ వినియోగదారుల కోసం రూపొందించేందుకు కీలక ప్రయత్నం ప్రారంభించింది. ఇందుకు ఇండియన్ వెబ్ బ్రౌజర్ డెవలప్‌మెంట్ ఛాలెంజ్ (IWBDC)ను నిర్వహించారు. ఇందులోని విజేతలైన Zoho Corp, Team PING, Team Ajna ను ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఈ కొత్త బ్రౌజర్ భారతీయ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా, డేటా గోప్యతను మెరుగుపరిచే విధంగా డెవలప్ చేయబడుతుంది.