India tour of England: క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ మరో రెండు రోజుల్లో (20, 2025 నుంచి) ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో తొలి టెస్ట్ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు లీడ్స్‌లో జరగనుంది. క్రికెట్ ప్రియులకు ఈ సిరీస్‌ను ఉచితంగా వీక్షించే అవకాశం కల్పించడం ద్వారా శుభవార్త అందినట్లయింది. ఈ టెస్ట్ సిరీస్‌ను భారత్‌లో సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. అంతేకాక, ఆన్‌లైన్ స్ట్రీమింగ్ కోసం జియో హాట్‌స్టార్ యాప్ మరియు వెబ్‌సైట్‌లో కూడా ఈ మ్యాచ్‌లు అందుబాటులో ఉంటాయి. ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్ మొత్తం ఈ నెట్‌వర్క్‌ల ద్వారా ప్రసారం కానుంది. అయితే దేశంలోని క్రికెట్ అభిమానులకు మరో గొప్ప వార్త ఏమిటంటే.. ఈ సిరీస్‌ను డిడి స్పోర్ట్స్ ఛానెల్‌లో కూడా ఉచితంగా వీక్షించవచ్చు. డిడి స్పోర్ట్స్ ద్వారా ఈ భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌ను పూర్తిగా ఫ్రీగా ఆస్వాదించే అవకాశం అభిమానులకు లభిస్తోంది.
భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ షెడ్యూల్:
తొలి టెస్ట్: జూన్ 20-24, 2025 – లీడ్స్
రెండో టెస్ట్: జులై 2-6, 2025 – బర్మింగ్హమ్
మూడో టెస్ట్: జులై 10-14, 2025 – లార్డ్స్
నాలుగో టెస్ట్: జులై 23-27, 2025 – మాంచెస్టర్
ఐదో టెస్ట్: జులై 31-ఆగస్టు 4, 2025 – కెన్నింగ్‌స్టన్ ఓవల్.