India warning to Pakisthan on pok issue : పీఓకేను ఖాళీ చేయండి.. ఐరాసలో పాక్కు భారత్ వార్నింగ్
పీవోకే నుంచి పాక్ అన్ని ప్రాంతాలను వెంటనే ఖాళీ చేయాలని భారత్ హెచ్చరించింది.
ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ వేదికగా భారత్ ప్రతినిధి స్నేహ.. పాక్ పై మండిపడింది.
జమ్మూ కాశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో అంతర్భాగమని నొక్కి చెప్పారు. వాటిని ఎప్పటికీ విడదీయలేరని తెలిపారు.
వెంటనే పీవోకే నుంచి పాక్ అన్ని ప్రాంతాలను ఖాళీ చేయాలని హెచ్చరించింది.
పాకిస్థాన్ ఉగ్రవాదులను ఎలా పెంచి పోషిస్తున్నది, ఆశ్రయం ఇస్తున్నది, సాయం చేస్తున్నది ప్రపంచ దేశాలన్నింటికీ తెలుసు అని విరుచుకుపడ్డారు.
అంతకుముందు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వర్చువల్ మీటింగ్‌లో భారత్ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆరోపించారు. దాంతో భారత్ ధీటుగా సమాధానం ఇచ్చింది.