యూనివర్సల్ హీరో కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో వస్తున్న సెన్సేషనల్ సీక్వెల్ ‘ఇండియన్ 2’. 1996లో వచ్చిన భారతీయుడు సినిమాకు ఇది సీక్వెల్ అని అందరికీ తెలిసిందే. మరి ఆడియెన్స్‌లో భారీ అంచనాలున్న ఈ మూవీని శంకర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేస్తున్నాడు. ఈ సినిమాకే ఎక్కువ టైమ్ కేటాయిస్తున్నారు. దీంతో శరవేగంగా కంప్లీట్ అవుతున్న ఈ భారీ సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్‌కు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీని నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ లేటెస్ట్గా అదిరిపోయే అప్డేట్ను అందించారు. లోకనాయకుడు కమల్ హాసన్ ఈ సినిమా కోసం తన డబ్బింగ్ వర్క్ ని స్టార్ట్ చేసేశారంటూ ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే సాలిడ్ అప్డేట్ ను మేకర్స్ అందించారు. కమల్ డబ్బింగ్ స్టార్ట్ చేసినట్లయితే సినిమా అయిపోవచ్చిందనే చెప్పాలి.
Read More :
Megastar’s 157th movie in 2025! 2025లో మెగాస్టార్ 157వ సినిమా!
http://idenijam.com/megastars-157th-movie-in-2025/