న్యూఢిల్లీ: ‘ఇండియా, చైనా బార్డర్లో ఉద్రిక్తల నేపథ్యంలో ఇండియన్ ఆర్మీకి చెందిన సైనికులు సిక్లీవ్లకు అప్లై చేసుకుంటున్నారని, పైగా గత 45 ఏండ్లలో తొలిసారిగా 80వేలకు పైగా సైనికులు లీవ్‌లకు అప్లై చేశారంటూ’ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్న వార్త అవాస్తవమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇండియన్ ఆర్మీ సైనికుల సిక్ లీవ్ వార్తలు అసత్యాలని మీడియా సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) స్పష్టం చేసింది. చైనాతో ఉద్రిక్తతల కారణంగా సైనికులు ఎవరూ లీవ్‌కు అప్లై చేయరని సైనిక అధికారులు కూడా స్పష్టం చేశారు. ఇలాంటి వార్తల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరికీ షేర్ చేయరాదని భారతీయ భద్రతాదళ అధికారులు స్పష్టం చేశారు.
సోషల్ మీడియాలో ఆర్మీపై బద్నాం వార్తలు.. ఖండించిన కేంద్రం
RELATED ARTICLES