Indian Coast Guard Jobs : ఇండియన్ కోస్ట్ గార్డ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
Indian Coast Guard Jobs – ఇండియన్ కోస్ట్ గార్డ్ ఉద్యోగం చేస్తూ దేశానికి సేవ చేసే సువర్ణావకాశం ఉంది.
ఇండియన్ కోస్ట్ గార్డ్ 50 పోస్టులను రిక్రూట్ చేస్తున్నది.
ఇందులో అసిస్టెంట్ కమాండెంట్, టెక్నికల్ ఇంజనీర్, టెక్నికల్ ఎలక్ట్రీషియన్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ జరుగుతున్నది.
దీని కోసం గ్రాడ్యుయేట్ అభ్యర్థులు ఇవాల్టి నుంచి డిసెంబర్ 17 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
మొత్తం ఖాళీలు 50 ఉండగా.. వీటిలో జనరల్ డ్యూటీ, కమర్షియల్ పైలట్ ఖాళీలు 40, టెక్నికల్ ఉద్యోగాలు 10 ఖాళీలకు భర్తీ చేస్తున్నారు.
అసిస్టెంట్ కమాండెంట్ స్థాయి అధికారులుగా నియమితులయ్యే వారికి నెలసరి రూ.56,100 జీతం ఇస్తారు.
జనరల్ డ్యూటీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారు 1997 జూలై 1-2001 జూన్ 30 మధ్య జన్మించిన వారై ఉండాలి.
కమర్షియల్ పైలట్ ఎంట్రీ ఉద్యోగాలకు 1997 జూలై 1-2003 జూన్ 30 మధ్య జన్మించిన వారు అర్హులు.
ఇక టెక్నికల్ పోస్టులకు 1997 జూలై1-2001 జూన్ 30 మధ్య జన్మించి ఉండాలి.
అర్హతలు ( Indian Coast Guard Jobs )
జనరల్ డ్యూటీ :
60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ డిగ్రీ. ఇంటర్మీడియట్ లేదా 12 వ తరగతిలో మ్యాథ్స్, ఫిజిక్స్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
కమర్షియల్ పైలట్ ఎంట్రీ :
12 వ తరగతి (ఫిజిక్స్ & మ్యాథ్స్) లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ జారీ చేసిన కమర్షియల్ పైలట్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలి.
టెక్నికల్ ఇంజినీరింగ్ :
60 శాతం మార్కులతో ఇంజనీరింగ్ డిగ్రీ. (నావల్ ఆర్కిటెక్చర్ లేదా మెకానికల్, మెరైన్ లేదా ఆటోమోటివ్ లేదా మెకాట్రానిక్స్ లేదా ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్ లేదా మెటలర్జీ లేదా డిజైన్ లేదా ఏరోనాటికల్ లేదా ఏరోస్పేస్‌లో డిగ్రీ)
ఎలక్ట్రిక్ బ్రాంచ్ :
ఎలక్ట్రానిక్స్ లేదా టెలికమ్యూనికేషన్ లేదా ఇన్‌స్ట్రుమెంటేషన్ లేదా ఇన్‌స్ట్రుమెంటేషన్ మరియు కంట్రోల్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా పవర్ ఇంజినీరింగ్ లేదా పవర్ ఎలక్ట్రానిక్స్‌లో డిగ్రీ కలిగా ఉండాలి.