తెలంగాణలో మరో 4 రోజుల పాటు వర్షాలు కురవనున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. మే 22 తర్వాత భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఆవర్తనానికి తోడు చత్తీస్ గఢ్, తెలంగాణ, రాయలసీమ మీదుగా ఇంటీరియర్ కర్నాటక వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో కూడా దక్షిణ తెలంగాణతో పాటు ఉత్తర తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని IMD తెలిపింది.