Homeహైదరాబాద్latest Newsశభాష్! ప్రపంచ వేదికపై సత్తా చాటిన తెలుగమ్మాయి

శభాష్! ప్రపంచ వేదికపై సత్తా చాటిన తెలుగమ్మాయి

బీద కుటుంబం. కూలి పని చేస్తేనే గానీ పూట గడవని పరిస్థితి. మరోవైపు మానసిక లోపం. చాలా ఇబ్బందులు. అవమానాలు. అయినా వెరవలేదు. బెదరలేదు. అకుంఠిత దీక్షతో తన టర్గెట్‌ను రీచ్ అయింది. తానేంటో తన ప్రతిభేంటో ప్రపంచానికి చాటి చెప్పింది. సంకల్పం ఉంటే మిరాకిల్స్ చేయొచ్చంటూ నిరూపించింది వరంగల్ జిల్లా కల్లెడ గ్రామానికి చెందిన జివాంజి దీప్తి.

జపాన్‌లో జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో జివాంజి సత్తా చాటింది. వుమెన్స్ టీ 20 కేటగిరీలో జరిగిన 400 మీటర్ల రేసును కేవలం 55.07 సెకన్లలో విన్ అయింది. వల్డ్ రికార్డు నమోదు చేసి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. 2024లో జరిగే పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది.

పారా స్పోర్ట్స్‌ ఆఫ్‌ ఇండియా, పారా స్పోర్ట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ జనరల్‌ సెక్రటరీ గడిపెల్లి ప్రశాంత్‌, కోచ్‌ నాగపురి రమేశ్‌, ప్రెసిడెంట్‌ సింగారపు బాబుతో పాటు పలువురు వరంగల్ వాసులు, బంధుమిత్రులు, ప్రముఖులు దీప్తిని అభినందించారు.

మానసిక లోపం ఉన్న అథ్లెట్లకు టీ20 (Intellectual impairment) కేటగిరీలో రేస్ నిర్వహిస్తారు.

Recent

- Advertisment -spot_img