Stock Market : దూసుకుపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లు
Stock Market : నిన్న నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు మళ్లీ భారీగా పుంజుకున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూలతలు మన మార్కెట్లపై ప్రభావం చూపాయి.
ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు లాభాల్లోనే కొనసాగాయి.
ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,040 పాయింట్లు పెరిగి 56,817కి చేరుకుంది.
నిఫ్టీ 312 పాయింట్లు లాభపడి 16,975కి ఎగబాకింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్
అల్ట్రాటెక్ సిమెంట్ (4.69%), యాక్సిస్ బ్యాంక్ (3.65%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (3.60%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (2.92%), ఇన్ఫోసిస్ (2.69%).
బీఎస్ఈ సెన్సెక్స్ లో సన్ ఫార్మా (-0.35%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-0.07%) నష్టపోయాయి.
Curd : పెరుగుతో ఈ పదార్థాలను కలిపి తింటే అనేక లాభాలు
Financial Security : హైదరాబాద్ లో ఆర్థిక భద్రత తక్కువే!.. మెట్రో నగరాలపై తాజా సర్వే