Homeఅంతర్జాతీయం#USA #NASA : కీలక పదవిలో భారతీయ మహిళ

#USA #NASA : కీలక పదవిలో భారతీయ మహిళ

The number of Indians increasing in superpower America continues. People of Indian descent impress everyone by ascending to the highest positions in America. Most importantly, the importance of those of Indian descent in the superpower has been growing since Joe Biden was sworn in as the new President of the United States.

అగ్రరాజ్యం అమెరికాలో భారతీయుల హవా కొనసాగుతోంది. భారత సంతతికి చెందిన వ్యక్తులు అమెరికాలో అత్యున్నత పదవులను అధిరోహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు.

మరీ ముఖ్యంగా అమెరికా కొత్త అధ్యక్షుడిగా జో బైడెన్‌ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి అగ్రరాజ్యంలో భారత సంతంతికి చెందిన వారి ప్రాముఖ్యత పెరుగుతోంది.

ఈ క్రమంలోనే ఇప్పటికే భారతీయులు పలు కీలక పదవులను చేపట్టారు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ జాబితాలో మరో భారతసంతతికి చెందిన మహిళ వచ్చి చేరారు.

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ యాక్టింగ్ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా భారత సంతతికి చెందిన భవ్యలాల్‌ సోమవారం నియమితులయ్యారు.

నాసా అంతరిక్ష సాంకేతిక రంగాభివృద్ధి, అమెరికా శాస్త్రీయ, సాంకేతిక విధానాల రూపకల్పనలో భవ్య కీలక పాత్ర పోషించారు.

ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ డిఫెన్స్‌ అనాలసిస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పాలసీలో 2005 నుంచి 2020 వరకు భవ్యా సభ్యురాలిగా విధులు నిర్వర్తించారు.

Recent

- Advertisment -spot_img