ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వచ్చే నెలలో లక్నోలో నైట్ సఫారీ, అడ్వెంచర్ పార్క్ నిర్మాణాన్ని ప్రారంభించనుంది. ఈ ప్రాజెక్ట్‌కు రూ.1,500 కోట్లకు పైగా పెట్టుబడిని వెచ్చించనున్నారు. ఇది రాష్ట్రంలో పర్యాటకాన్ని పెంపొందించడంతో పాటు, సందర్శకులకు వినోదం, వన్యప్రాణులను వీక్షించేటప్పుడు వచ్చే అనుభవాన్ని అందించే ప్రాజెక్టుగా మారనుంది. ఈ నైట్ సఫారీ దేశంలోనే మొదటిది కావడం విశేషం.