IndiaTest match : బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో జరుగుతున్న భారత్ – ఇంగ్లండ్ రెండో టెస్ట్ మ్యాచ్‌కు వర్షం భారీ అడ్డంకిగా మారింది. ఐదవ రోజు ఆట ప్రారంభం కాకముందే భారీ వర్షం కురవడంతో మ్యాచ్ ఆలస్యమైంది. రెండో టెస్ట్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగుల భారీ స్కోరు సాధించింది. శుభ్‌మన్ గిల్ (269, 387 బంతుల్లో, 30 ఫోర్లు, 3 సిక్సర్లు) డబుల్ సెంచరీతో చెలరేగగా, యశస్వి జైశ్వాల్ (87), రవీంద్ర జడేజా (87), వాషింగ్టన్ సుందర్ (42) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయిబ్ బషీర్ మూడు వికెట్లు, క్రిస్ వోక్స్, జోష్ టంగ్ రెండేసి వికెట్లు తీసుకున్నారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 77/3 స్కోరుతో నిలిచింది. ఇంగ్లండ్ ఇంకా 510 పరుగుల వెనుకంజలో ఉంది, మరో 7 వికెట్లు పడగొడితే భారత్‌కు రికార్డు విజయం ఖాయం. అయితే ఐదవ రోజు ఉదయం బర్మింగ్‌హామ్‌లో భారీ వర,్షం కురిసింది, దీంతో ఆట ప్రారంభం కాకుండానే ఆలస్యమైంది. వాతావరణ సూచనలు కూడా రోజంతా వర్షం కొనసాగే అవకాశం ఉందని తెలిపాయి, దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశం కనిపిస్తోంది.