Indiramma Athmiya Bharosa : ఇందిరమ్మ ఆత్మీయ భరోసా (Indiramma Athmiya Bharosa ) పథకం కింద భూమిలేని వ్యవసాయ కూలీల ఎంపిక ప్రక్రియలో రెవెన్యూ, వ్యవసాయ, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు భాగస్వాములుగా ఉంటారు. ఉపాధిహామీ పథకం కింద జాబ్కార్డులు పొందిన కుటుంబాలను పరిగణనలోనికి తీసుకుంటారు. 2023-24 సంవత్సరంలో 20 రోజులపాటు పనిచేసి ఉండాలి. గ్రామసభల్లోనే లబ్ధిదారులను గుర్తిస్తారు. ఈ సమాచారాన్ని అన్ని జిల్లాల కలెక్టర్లు 25న రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు. దీని ఆధారంగా ప్రభుత్వం 26న ఆత్మీయ భరోసా సాయం విడుదల చేస్తుంది.